మే 31 అంటే ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. దానికి కారణం సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు అదే తేదీ కావడం కారణం. గత నాలుగైదేళ్లుగా మహేష్‌బాబు తన తండ్రి పుట్టినరోజు సందర్బంగా తన చిత్రాల టీజర్లు విడుదల చేసి ఆయనకు బర్త్‌డే కానుకగా అందిస్తున్నాడు. మరి ఈ ఏడాది మే 31న మహేష్ తన తండ్రి కృష్ణకు, ఆయన అభిమానులకు ఇస్తోన్న గిఫ్ట్ ఏమిటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కొందరు చెబుతున్న దాన్ని బట్టి మే 31న మహేష్ తన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరికొందరు మాత్రం మహేష్ తన తండ్రి బర్త్‌డే కానుకగా ఆయన బర్త్‌డేకు రెండు రోజుల ముందు అంటే మే 29న తన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయంలో తన తండ్రి బర్త్‌డేకు ఈసారి ఆయన తనయుడు మహేష్ ఇచ్చే గిఫ్ట్ ఏమిటి? అనేది కొద్దిరోజుల్లో తేలిపోతుంది.