Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: ప్రదీప్‌ నందన్‌

Sat 14th Mar 2015 09:00 AM
pradeep nandan,jagannatakam review,khsnisha,director pradeep nandan  సినీజోష్‌ ఇంటర్వ్యూ: ప్రదీప్‌ నందన్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: ప్రదీప్‌ నందన్‌
Advertisement
Ads by CJ

కొత్త స్క్రీన్‌ప్లే.. సినిమా కొత్తగా వుంది.. డైరెక్షన్‌ బాగుంది.. ఈ మాటలు ఇండస్ట్రీలోగానీ, ఆడియన్స్‌లోగానీ వినిపిస్తున్నాయి. ఈ అప్రిషియేషన్‌ అంతా లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జగన్నాటకం’ చిత్రం గురించి. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌  చెయ్యడమే కాకుండా హీరోగా కూడా నటించిన ప్రదీప్‌ నందన్‌కి ఇది మొదటి సినిమా. ‘ప్రయాణం’ చిత్రానికి చంద్రశేఖర్‌ ఏలేటి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రదీప్‌ ఆ అనుభవంతో ఒక మంచి కథ రెడీ చేసుకొని దానికి డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేను సమకూర్చుకొని ‘జగన్నాటకం’తో డైరెక్టర్‌గా, హీరోగా పరిచయం అయ్యాడు.  ఈ చిత్రానికి విడుదలైన అన్ని సెంటర్స్‌ నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రదీప్‌ నందన్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ..

మీ ‘జగన్నాటకం’ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌ ఎలా వుంది?

చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా వుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు.  సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా మంచి సినిమా తీశారని, చాలా థ్రిల్‌ ఫీల్‌ అయ్యామని చెప్తున్నారు. థియేటర్‌లో ఆడియన్స్‌ మధ్యలో సినిమా చూస్తున్నప్పుడు వారి రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. 

కొత్త తరహా సినిమా, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే.. ఇంతవరకు బాగానే వుంది. కానీ, ‘జగన్నాటకం’ అనే టైటిల్‌ ఈ సినిమాకి ఎంతవరకు యాప్ట్‌ అయిందనుకుంటున్నారు?

నేను మాత్రం చాలా పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా అంతా కొన్ని కో ఇన్సిడెంట్స్‌ మీద నడుస్తుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టైటిల్‌ని యాక్సెప్ట్‌ చేస్తారు. మోడ్రన్‌ టైటిల్‌ పెట్టి వుంటే ఇంకా బాగుండేది అనే సజెషన్‌ కొంతమంది ఇచ్చారు. సేమ్‌టైమ్‌ ‘జగన్నాటకం’ అనే టైటిల్‌ కూడా సినిమా యాప్ట్‌ అన్నవారు కూడా వున్నారు. 

ఎ సెంటర్స్‌ ఆడియన్స్‌, ఇంటలెక్చువల్స్‌ మీరు చెప్పిన డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేని బాగానే రిసీవ్‌ చేసుకుంటారు. బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌కి ఆ స్క్రీన్‌ప్లే అర్థమవుతుందంటారా?

ఈ సినిమా చూడడం మొదలు పెట్టిన ప్రతి ఆడియన్‌కి నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ కలుగుతుంది. స్క్రీన్‌ప్లే, ట్విస్టులవల్ల  స్టార్టింగ్‌లో కొంత ఇబ్బంది పడినా క్లైమాక్స్‌కి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సినిమా బాగా తీశారు అని అంటారు. 

మీ మొదటి సినిమాలో హీరోగా నటించి డైరెక్ట్‌ చేశారు. యాక్టింగ్‌, డైరెక్షన్‌ ఈ రెండిరటిలో మీకు నచ్చింది ఏది?

నేను డైరెక్టర్‌ని అవ్వాలని అనుకున్న దానికంటే ముందే ఒక మంచి యాక్టర్‌ కావాలని కోరుకునేవాడిని. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి ఫ్యాన్‌ని. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌గారి ఫ్యాన్‌ని. ఇద్దర్నీ నేను బాగా అభిమానిస్తాను. 

యాక్టర్‌ అవ్వాలని వచ్చారు. హీరో అయ్యారు, డైరెక్టర్‌ అయ్యారు. ఈ రెండిరటిలో ఏది కంటిన్యూ చేస్తారు?

ముందైతే కంప్లీట్‌గా ఒక సినిమా డైరెక్ట్‌ చెయ్యాలనుకుంటున్నాను. నా దగ్గర మహేష్‌, బన్నికి మంచి కథలు వున్నాయి. వారిద్దర్నీ డైరెక్ట్‌ చెయ్యాలన్న కోరిక నాకు వుంది. నావంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు. ఆ కాన్సెప్ట్‌తో ఒక సినిమా చెయ్యాలని ఆలోచిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో కమ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ నందన్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ