Advertisementt

సినీ ఇండస్ట్రీ కోసం మురళి మోహన్ శాంతి హోమం..!

Fri 13th Mar 2015 02:27 PM
maa association,murali mohan,giribabu,suryanarayanarao  సినీ ఇండస్ట్రీ కోసం మురళి మోహన్ శాంతి హోమం..!
సినీ ఇండస్ట్రీ కోసం మురళి మోహన్ శాంతి హోమం..!
Advertisement

ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు అనారోగ్య కారణాలతో అకాల మృత్యువుకు గురి కావడం అందర్నీ బాధిస్తున్న విషయం. ఇంతమంది అకాల మరణం చెందడం దుష్టశక్తి ప్రభావమని కొందరు పెద్దరూ భావిస్తున్నారు. దీంతో మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు 'శాంతి హోమం' జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీమోహన్ శుక్రవారం(మార్చి 13) న ఫిలింనగర్ దైవ సన్నిధిలో తెలిపారు. ఈ సందర్భంగా మురళిమోహన్ మాట్లాడుతూ "ఏ సభకు వెళ్ళిన అందరూ సినిమా ఇండస్ట్రీకి ఏమైంది. ఎందుకు అందరూ ఇలా అకాల మరణం చెందుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై రాజమండ్రిలో వేదపండితుల్ని సంప్రదించగా 'అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం' జరిపిస్తే జరుగుతున్న అరిష్టాలు ఆగుతాయని, శాంతి కలుగుతుందని సూచించారు. అందరి మంచిని ఆకాంక్షిస్తూ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ హోమం చేస్తే యావత్ చిత్ర పరిశ్రమకు మంచి జరుగునని నిర్ణయం తీసుకోవడమైనది. దీనికి విశాఖ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాహాస్వామి ఈ హోమం జరిపించడానికి సహృదయముతో అంగీకరించారు" అని తెలిపారు. 

గిరిబాబు మాట్లాడుతూ "ఇంతమంచి కార్యక్రమం చేపట్టడం సంతోషకరం. వేదపండితుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి విజయవంతం చేయాలని భావిస్తున్నా" అని అన్నారు.

కాజ సూర్యనారాయణరావు మాట్లాడుతూ "ఈ అకాల మరణాలు గురించి సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ ఒకసారి మాట్లాడి ఏమైనా పూజలు చేయిస్తే మంచిదని సజెషన్ ఇచ్చారు. ఈ హోమానికి సినీ ఇండస్ట్రీకి సంబందించిన అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

శివకృష్ణ మాట్లాడుతూ "సినీ వాళ్ళందరిని ఒక చోట చేర్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం" అని చెప్పారు.

కార్యక్రమము వివరాలు:

23-03-2015 నుండి 24-03-2015 రెండు రోజులు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు. 

సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు

25-03-2015 న ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు 

మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement