Advertisementt

మరోసారి జంటగా నటించనున్న రవితేజ, త్రిష.!

Fri 13th Mar 2015 06:45 AM
raviteja,trisha,special 26 remake,thyagarajan  మరోసారి జంటగా నటించనున్న రవితేజ, త్రిష.!
మరోసారి జంటగా నటించనున్న రవితేజ, త్రిష.!
Advertisement
Ads by CJ

ఇంతకముందు రవితేజతో 'కృష్ణ' చిత్రంలో ఆడిపాడిన త్రిష ఈ క్రేజీ స్టార్ తో మరోసారి రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. అక్షయ్ కుమార్, కాజల్ జంటగా బాలీవుడ్ లో రూపొందిన సినిమా 'స్పెషల్ 26'. 1987 లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కడ మంచి హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్ రైట్స్ ను త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంతో రవితేజ, త్రిష మరోసారి జత కడుతున్నారు. ఈ చిత్ర దర్శకుడు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. త్యాగరాజనే దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ