అక్కినేని నాగార్జున ఇప్పుడు కేవలం వైవిధ్యమైన చిత్రాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా వెరైటీ కాన్సెప్ట్ ను, తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటున్నాడు. కాగా ఆయన ప్రస్తుతం కళ్యాన్ కృష్ణ అనే నూతన దర్శకునితో 'సోగాదేచిని నాయనా' చిత్రం చేస్తున్నాడు. ఇందులో నాగ్ తాత, మనువడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో తాత పాత్ర ఓ ఆత్మ అని సమాచారం. కాగా ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ ను ఇటీవల విడుదల చేసారు. ఇవి అందరినీ అలరిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మైసూరులో జరుగుతోంది. ఈ సందర్భంగా నాగార్జున రమ్యకృష్ణ అందాలను ఆకాశానికి ఎత్తేశాడు. ఆమెతో దాదాపు 15 ఏళ్ళ గ్యాప్ తర్వాత కలిసి నటిస్తున్నానని, అప్పటికి ఇప్పటికీ ఆమె అందాలతో మార్పులేదని, ఎంతో బ్యూటీగా ఉందని ట్వీట్ చేసాడు. నిజమే మరి..! నాగార్జున ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. కాబట్టి ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిందే.