Advertisementt

తారక్-సుక్కు చిత్రంపై పలురకాల వార్తలు..!

Wed 11th Mar 2015 01:57 PM
ntr,sukumar,bvsn prasad,nagachaithnya,dochey movie  తారక్-సుక్కు చిత్రంపై పలురకాల వార్తలు..!
తారక్-సుక్కు చిత్రంపై పలురకాల వార్తలు..!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్-సుకుమార్-బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ల కాంబినేషన్ లో రూపొందున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సివుంది. కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడానికి మరో నెల పడుతుందని తెలుస్తోంది. దీంతో ఫిలిం నగర్ లో ఈ చిత్రం గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ 'టెంపర్' చిత్రం విజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని, రిలాక్స్ కావడానికే సమయంలో అడిగినందువల్ల ఈ చిత్రం షూటింగ్ లేటవ్వుతోందని కొందరు అంటుంటే.. కాదు.. 'టెంపర్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ సుకుమార్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు సూచించాడని, సుక్కు ప్రస్తుతం అదే పని మీద ఉండటంతో షూటింగ్ లేటవ్వుతోందని మరి కొందరి వాదన. తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకానుందని, షూటింగ్ లో మేజర్ పార్ట్ యూరప్ లో చిత్రీకరించాల్సి వున్నందున లోకేషన్ల వేటలో ఉన్నారని అంటున్నారు. మరి కొందరు మాత్రం ఆర్ధిక సమస్యల వల్ల ఈ చిత్రం లేటవ్వుతోందని ప్రచారం మొదలైంది. 'అత్తారింటికి దారేది' వంటి సినిమాను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కు ఆర్ధిక కష్టాలు ఎందుకుంటాయి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అందులోను ఆయన చేతిలో రిలయన్స్ సంస్థ కూడా ఉండటంతో ఆర్ధిక సమస్యలు నిజం కాదంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నాగచైతన్య హీరోగా 'దోచేయ్' సినిమా నిర్మిస్తున్నాడని, పెట్టుబడి మొత్తం ఆచిత్రంపైనే పెట్టేయడంతో సమయానికి డబ్బులు అడ్జెస్ట్ కాకపోవడంతో ఎన్టీఆర్ సినిమా లేటవ్వుతోందని, భారీ భారీ నిర్మాతలకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు కామనే అనేది కొందరి వాదన. మరి ఈ వాదలన్నింటిలో నిజమేదో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ