Advertisementt

మరో ఆసక్తికర కాంబినేషన్..!

Wed 11th Mar 2015 08:04 AM
ajith,ennai arindal,gowtham menan,surya,vikram  మరో ఆసక్తికర కాంబినేషన్..!
మరో ఆసక్తికర కాంబినేషన్..!
Advertisement
Ads by CJ

ఇటీవలే అజిత్ హీరోగా 'ఎన్నై అరిందాల్'(తెలుగులో 'ఎంతవాడు కానీ') చిత్రంతో భారీ హిట్టుకొట్టిన దర్శకుడు గౌతమ్ మీనన్. కాగా గౌతమ్ వాస్తవానికి హీరో సూర్య కోసం ఓ స్టొరీని తయారుచేసిపెట్టుకున్నాడు. కానీ ఎంతకీ సూర్య ఒక పట్టాన ఒప్పుకోకుండా పడే పడే మార్పులు చేర్పులు అంటూ విసిగించడంతో ఈ స్టొరీని పక్కన పెట్టిన గౌతమ్ 'ఎన్నై అరిందాల్' చిత్రం తీశాడు. తాజాగా ఆయన సూర్యతో తీయలనుకొన్న స్టొరీని మరలా లైమ్ లైట్ లోకి తెచ్చి విక్రమ్ హీరోగా ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రంలో విక్రమ్ కు జోడీగా నయనతారకు హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆసక్తికర కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలోని దర్శకుడు, హీరో, హీరోయిన్.. ఇలా అందరూ టాలీవుడ్ కి సుపరిచితమైన వారే కావడంతో ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలనే ప్లానింగ్ లో గౌతమ్ మీనన్ ఉన్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ