Advertisementt

'రేయ్' ప్రమోషన్ కు పవన్ సహకరిస్తాడా..?

Wed 11th Mar 2015 06:05 AM
yvs chowdary,sai dharam teja,pawan kalyan,rey movie promotion  'రేయ్' ప్రమోషన్ కు పవన్ సహకరిస్తాడా..?
'రేయ్' ప్రమోషన్ కు పవన్ సహకరిస్తాడా..?
Advertisement
Ads by CJ

'రేయ్' ఆడియో వేడుక జరిగి చాలాకాలం అయిపోయింది. ఈ చిత్రం ఆడియో వేడుకకు పవన్ హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు సినిమాకు ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. కానీ దాన్ని నిర్మాత, దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని చౌదరి నిర్ణయించాడు. సినిమాకు మరలా పూర్వపు హైప్ కావాలంటే అది కేవలం పవన్ కే సాధ్యమని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. ఇందుకోసం వైవిఎస్ చౌదరి నానా తంటాలు పడుతున్నాడు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం కోసం ఆయన తన శక్తిమేర ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకోసం పవన్ పేరును సినిమా ప్రచారం కోసం వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 'రేయ్' మూవీలో 'పవనిజం' పేరుతో పూర్తిగా పవన్ ను ప్రస్తావిస్తూ ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ పాటను 14వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ వేడుకకు పవన్ ఇస్తాడా? రాడా? అనే దానిపైనే 'రేయ్' చిత్రం కలెక్షన్లు ఆధారపడి ఉన్నాయి. పవన్ కనుక ఓకే అంటే మెగాభిమానులు 'రేయ్'కు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తేవడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ తరహాలో చౌదరి పవన్ ను వాడుకుంటాడా? లేదా అనేది తేలాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ