‘మిర్చి’ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న కొరటాల శివ ఆ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి అందరి హీరోల దృష్టిలో పడ్డాడు..ఆ కోవలోనే మహేష్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మహేష్‌కు సరైన హిట్ ఇవ్వాలనే కసితో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తొలిచిత్రం ‘మిర్చి’ అంటూ పూర్తి మాస్ టైటిల్‌ను పెట్టిన కొరటాల... మహేష్ చిత్రానికి మాత్రం శ్రీమంతుడు అనే సాఫ్ట్ టైటిల్‌ను పెట్టడంతో ప్రిన్స్ అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే ఈ కథకు ఈ టైటిలే యాప్ట్ అవుతుందని అభిమానులకు సర్ధిచెప్పాడు దర్శకుడు. ఏది ఏమైనా టైటిల్ సాఫ్ట్‌గా వున్నా... మహేష్‌కు స్ట్రాంగ్ హిట్ ఇవ్వాలని అభిమానులు కొరటాల శివను కోరుతున్నారట...