వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చిన నితిన్ ఇటీవల ‘చిన్నదాన నీకోసం’ యావరేజీగా నిలవడంతో కాస్త ఉత్సాహం తగ్గింది. ప్రస్తుతం అఖిల్‌తో ఓ సినిమాను నిర్మించే పనిలో వున్న ఈ యంగ్‌హీరో ఇప్పటి వరకు తను నటించబోయే చిత్రం గురించి సరైన క్లారిటీకి రాలేదు. అయితే నితిన్ త్వరలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యాడని తెలిసింది. ఇంతకు ముందు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘హార్ట్‌ఎటాక్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. అందుకే కాబోలు ఈసారి పూర్తి సక్సెస్ కోసం పూరీనే నమ్ముకున్నాడు నితిన్... అయితే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే.. వంటి విభిన్న ప్రేమకథలతో ఆకట్టుకున్న నితిన్ మళ్లీ రోటిన్ సినిమాలకు కూడా ఓకే చెప్పేస్తున్నాడా..పొటాక్ తప్పుతున్నాడా అనే అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతోంది. నూతన దర్శకులను ప్రోత్సాహిస్తు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ తన సక్సెస్ జర్నీని నితిన్ కంటిన్యూ చేయాలని అందరూ ఆశిస్తున్నారు.. అయితే నితిన్ మాత్రం ఇందుకు భిన్నంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.