Advertisementt

వెరైటీని కోరుకుంటున్న ప్రభాస్‌...!

Tue 10th Mar 2015 12:31 PM
prabhas,bahubali movie,run raja run,sujeeth,romantic movie  వెరైటీని కోరుకుంటున్న ప్రభాస్‌...!
వెరైటీని కోరుకుంటున్న ప్రభాస్‌...!
Advertisement
Ads by CJ

గత రెండేళ్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ షూటింగ్‌లో కత్తులు, యుద్దాలు, గుర్రాలు.. ఇలా వీటితో విసిగిపోయిన ప్రభాస్‌ ‘బాహుబలి’ పూర్తికాగానే కత్తులు పట్టుకున్న చేతితో పువ్వులు పట్టుకొని రొమాన్స్‌ చేయాలని ఉబలాటపడుతున్నాడట. ‘డార్లింగ్‌’ తర్వాత ఆ కోవలో మరో చిత్రం చేయడానికి ఉత్సాహపడుతున్నాడని సమాచారం. దీనికి తగ్గట్లుగానే అంటే ప్రభాస్‌ కోరుకున్న విధంగానే అతడిని వెరైటీగా చూపించడానికి ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ రేయింబవళ్లు కష్టపడుతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి చేతిలో పడిన తర్వాత మరెంత యాక్షన్‌ సినిమా చేసినా కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. అందుకే యాక్షన్‌, మాస్‌ చిత్రాలను పక్కనపెట్టిన ప్రభాస్‌ ఓ రొమాంటిక్‌ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ