Advertisementt

చౌదరి కష్టాలు...!

Tue 10th Mar 2015 08:23 AM
sai dharam tej,yvs chowdary,rey movie,jil,alluarjun  చౌదరి కష్టాలు...!
చౌదరి కష్టాలు...!
Advertisement
Ads by CJ

గతేడాది దసరాకు పెద్ద పెద్ద సినిమాలకు పోటీగా విడుదలై ‘లౌక్యం’తో పెద్ద హిట్‌ కొట్టి అందరినీ ఆశ్యర్యపరిచిన హీరో గోపీచంద్‌. ఆయన ఈసారి కూడా వేసవి సీజన్‌కు బోణీ కొడుతూ ‘జిల్‌’ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 12న విడుదల కానుండగా, సినిమాను మార్చి 27న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా చాలాకాలంగా విడుదలలో జాప్యం జరుగుతూ.. ఎట్టకేలకు విడుదలకు సిద్దమైన మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌ మొదటి చిత్రం ‘రేయ్‌’, అనేక అడ్డంకుల మధ్య ఈ చిత్రాన్ని మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తామని ఈ చిత్ర నిర్మాణ దర్శకుడు వై.వి.ఎస్‌.చౌదరి ప్రకటించాడు. మరి గోపీచంద్‌ ‘జిల్‌’, సాయిధరమ్‌తేజ్‌ల ‘రేయ్‌’ల విడుదల ఒకే తేదీన విడుదల కానుండటం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. మరోపక్క ‘రేయ్‌’ చిత్రానికి మరో అడ్డంకి కూడా కలగనుంది. సాధారణంగా మెగాక్యాంప్‌ హీరోలు తమ తమ చిత్రాల విడుదల మధ్య కనీసం నెల గ్యాప్‌ తీసుకుంటారు. కానీ ‘రేయ్‌’ చిత్రం మార్చి 27న విడుదలకు సిద్దమవుతుండగా, ఆ చిత్రం విడుదలైన వారంలోపే అల్లుఅర్జున్‌`త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ కష్టాల నుండి సాయిని, వైవిఎస్‌ చౌదరిని రక్షించే నాధుడు కనిపించడం లేదని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ