Advertisementt

మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న నిఖిల్‌...!

Tue 10th Mar 2015 07:49 AM
swamyrara,karthikeya,surya vs surya,nikhil,karthikeya sequel  మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న నిఖిల్‌...!
మంచి ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న నిఖిల్‌...!
Advertisement
Ads by CJ

‘స్వామిరారా’, ‘కార్తికేయ’ చిత్రాలతో మంచి ఉపుమీదున్న నిఖిల్‌ తాజా చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’కు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికి మంచి ప్రయోగాత్మకమైన చిత్రంగా, మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కాగా ఈ సందర్బంగా తాము త్వరలో ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా ‘కార్తికేయ2’కు శ్రీకారం చుడుతున్నట్లు హీరో నిఖిల్‌ ట్విట్టర్‌లో తెలియజేశాడు. తాను, దర్శకుడు చందుమొండేటితో కలిసి ఈ సీక్వెల్‌ చేయనున్నట్లు ఆయన తెలిపాడు. కాగా త్వరలో చందు మొండేటి నాగచైతన్య హీరోగా ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘కార్తికేయ2’ ఉంటుందని సమాచారం. మరి తెలుగులో పెద్దగా హిట్‌ కాని సీక్వెల్‌ ఫార్ములా ‘కార్తికేయ’ విషయంలో ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ