Advertisementt

నయనకున్న క్రేజ్‌ అలాంటిది...!

Tue 10th Mar 2015 07:38 AM
nayanathara,banglore days,sreedivya,dil raju,pvp  నయనకున్న క్రేజ్‌ అలాంటిది...!
నయనకున్న క్రేజ్‌ అలాంటిది...!
Advertisement
Ads by CJ

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘బెంగుళూరుడేస్‌’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో పి.వి.పి.సంస్థతో పాటు దిల్‌రాజు నిర్మాతగా రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి తెలుగులో వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, వరుణ్‌తేజ్‌, శర్వానంద్‌, నిత్యామీనన్‌లు నటిస్తున్నారు. ఇదే చిత్రం తమిళలో ఆర్య, రానా, శ్రీదివ్యలు ప్రధానపాత్రల్లో  రూపొందనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన గెస్ట్‌ పాత్ర ఉందిట. ఆ పాత్ర కోసం పివిపి సంస్థ దక్షిణాది టాప్‌ హీరోయిన్‌ నయనతారను సంప్రదించినట్లు సమాచారం. ఆ పాత్రను తెలుగుతోపాటు తమిళంలో కూడా నయన చేతనే చేయించాలనే ఉద్ధేశ్యంలో ఉన్న పివిపి సంస్థ నయనకు కలిసి డేట్స్‌ కోరగా ఆమె భారీమొత్తం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నయన చేతనే ఆ పాత్రను చేయాలని సిద్దపడిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్దమవ్వడంతో ఆ పాత్రను నయనతో చేయించడం ఖాయమైపోయిందని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ