Advertisementt

మహేష్‌కు పోటీగా ఎదుగుతున్నారు....!

Tue 10th Mar 2015 06:14 AM
mahesh babu,add world,pawan kalyan,allu arjun,akhil  మహేష్‌కు పోటీగా ఎదుగుతున్నారు....!
మహేష్‌కు పోటీగా ఎదుగుతున్నారు....!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ అడ్వర్టైజ్‌ ప్రపంచంలో ఇప్పటివరకు మహేష్‌బాబే నెంబర్‌వన్‌.పవన్‌కళ్యాణ్‌కు ఇలాంటి యాడ్స్‌లో నటించే ఇంట్రస్ట్‌ లేకపోవడమే మహేష్‌ ఏకచ్ఛత్రాధిపత్యానికి కారణం అని ఎవ్వరైనా చెబుతారు. అయితే చిన్న చిన్నగా మరో మెగాహీరో అల్లుఅర్జున్‌ కూడా యాడ్‌ ప్రపంచంలో మహేష్‌కు పోటీగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే ఆయన ఓ.ఎల్‌.ఎక్స్‌, లాట్‌ మొబైల్స్‌, జాయ్‌ అలూకాస్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. తాజాగా ఆయన ప్రముఖ టూవీలర్‌ కంపెనీ హీరో సంస్థకు చెందిన ‘గ్లామర్‌ 125 సిసి’బైక్‌కు రీజినల్‌ అంబాసిడర్‌గా పనిచేశాడు. సౌత్‌లో ఆయనకు మంచి మార్కెట్‌, యూత్‌లో స్పెషల్‌ క్రేజ్‌ ఉన్నాయి. ఇది తమ ప్రొడక్ట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని హీరో కంపెనీ ఆశపడుతోంది. మొత్తానికి రాబోయే కాలంలో మహేష్‌కు పోటీగా బన్నీ, అఖిల్‌లు నిలబడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ