క్రికెట్ , సినిమా, రంగాలు రెండు అన్నదమ్ముల లాంటివే కాని అక్కడ
రీ టేక్ లుండవు,ఇక్కడ వుంటాయి - ప్రముఖ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్
ఓ క్రికెటర్గా అబిమానుల గుండెల్లో స్టార్ గా ఎదిగిన మీరు నటించిన మెదటి చిత్రం సచిన్ ఇప్పుడు తెలుగు లో విడుదలవుతుంది. ఏలా ఫీలవుతున్నారు?
నాకు హైదరాబాద్ ని చాలా అనుభందం వుంది.హైదరాబాద్ బిర్యాని, ఇరాని ఛాయ్ అంటే చాలా ఇష్టం. నేను తెలుగు మాట్లాడలేను కాని తెలుగు అర్ధమవుతుంది. నేను, సుహసిని గారు కలిసి నటించిన సచిన్ అనే చిత్రం కన్నడ లో విడుదలయ్యింది. చాలా మంచి విజయం సాధించింది. నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అయ్యింది. ఇప్పడు తెలుగు లో మార్చి 13న విడుదలవుతుంది. ఇలా వరుసగా బంపర్ ఆఫర్స్ వస్తుండటంతో ఆనందంగా వుంది.
క్రికెటర్ గా ఈ చిత్రంలో నటించేటప్పుడు ఏమన్నా ఇబ్బంది ఫీలయ్యారా?
జ. లేదు ఎందుకంటే నేను ఇందులో కూడా క్రికేట్ కోచ్ గా చేశాను. సచిన్ అనే పిల్లాడితో పాటు కొంతమంది పిల్లలకి క్రికెట్ నేర్పించే కోచ్ గా నటించాను. పెద్దగా ఇబ్బంది పడలేదు అయినా క్రికెట్ , సినిమా, రంగాలు రెండు అన్నదమ్ముల లాంటివే కాని అక్కడ రీ టేక్ లుండవు.. ఇక్కడ వుంటాయి అంతే తేడా. (నవ్వుతూ)
ఈ ప్రపోజల్ ఎవరు మీ దగ్గరికి తీసుకువచ్చారు.. మీరు ఈ స్టోరి లో ఏమి నచ్చి నటించారు.?
ఈ స్టోరి చెప్పింది మాత్రం డైరక్టర్ గారు. అయితే ఈ స్టోరి వినమని చెప్పింది మాత్రం సుహసిని గారు. ఈ కథ వినండి ఈ పాత్రకి మీరైతే బాగుంటుదని అనుకుంటున్నాము. విని చెప్పండి అని అన్నారు. మోయిన్ గా ఈ కథలో మానవత్వం వుంది. మానసిక పరిస్థితి సరిగ్గాలేని ఓ కుర్రాడి చివరి కొరిక క్రికెట్ ఆడాలని. అయితే ఆ కుర్రాడి కొరిక తీర్చటం కోసం అందరూ ఏవిధంగా మానవత్వంతో ఎలా సహయం చేశారనేది చిత్ర కథలొ ముఖ్యాంశం. ఇదే నన్ను ఈ చిత్రంలో నటించటానికి కారణమయ్యింది. దర్శకుడు చెప్పిన కథాంశం నన్ను ఆకట్టుకుంది.
సీనియర్ నటి సుహసిని గారితో నటించటం ఏలా ఫీలవుతున్నారు.?
అసలే నటించంటం కొత్త, దానికి తొడు మహనటి సుహసిని గారితో కాంబినేషన్ ఇంక నా సిట్యువేషన్ ఎలా వుంటుదో ఆలోచించండి. టోటల్ బాడి షెకింగ్. కాని సుహసిని గారు మాత్రం నాకు ఎలా నిలబడాలో, ఎలా డైలాగ్ చెప్పాలో, ఎలా నటించాలో చక్కగా టీచర్ లా చెప్పి చేయించారు. తను కాకుండా ఎవరైనా అయితే నేను నటించేవాడ్ని కాదు. ఈ సినిమాలో నాకంటే సుహసిని గారి పాత్ర అంటేనే ఇష్టం నాకు. థ్యాంక్స్ టు సుహసిని గారు..
ఇక ముందు సినిమాల్లో నటిస్తారా?
చక్కటి కథ అంటే సోషల్ ఏవేర్‌నెస్ వున్న సబ్జెక్ట్ లు వస్తే తప్పకుండా చేస్తాను. సచిన్ లాంటి కథలతొ వస్తే మారు మాట్లాడకుండా నటిస్తాను.
ఒక పక్క మన టీం ఇండియా వాళ్ళు దూసుకెళుతున్నారు. కప్ మనదేనంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు మీరేమంటారు?
టీం ఇండియాలో అందరూ యూత్ బాగా వున్నారు. మనం ఊహించిన దానికంటే బెటర్ గా ఆడుతున్నారు. ఇదే జోరుతో వెలితే తప్పకుండా కప్పు మనదే..
మన ఇండియా టీం కి మీరేమైనా సలహలు ఇస్తుంటారా.?
తప్పకుండా ఇస్తాను. సీనియర్ ఆటగాళ్ళ నుండి కుర్ర ఆటగాళ్ళు తప్పకుండా సలహలు తీసుకోవాలి. కుర్రాళ్ళ టాలెంట్ కి మాలాంటి వాళ్ళ అనుభవం తోడవ్వుతుంది.
సచిన్ అనే టైటిల్ పెట్టి సినిమా చెయ్యమంటే మీరు ఇబ్బందిగా ఫీలవ్వలేదా.?
ఎందుకు ఇబ్బంది ఫీలవ్వాలి. ఇండియా క్రికెట్ అంటే మనకి మందు గుర్తోచ్చేది సచిన్ పేరు మాత్రమే. సచిన్ పేరుతో చేస్తున్న చిత్రంలో నటించటం గర్వంగా ఫీలవుతున్నా..