తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా షార్ట్ ఫిలింస్‌కి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఏకశిల షార్ట్ ఫిలిం అవార్డ్స్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా మంచి షార్ట్ ఫిలింస్‌ని సెలెక్ట్ చేసారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి 106 షార్ట్ ఫిలింస్ స్క్రీనింగ్‌కి రాగా, వాటిని 28 రోజుల్లో పరిశీలించి ఫలితాలను గుప్తంగా వుంచి, అవార్డుల ప్రదానోత్సవం రోజున ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, బి.నర్సింగరావు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, డి.జి. నాగేశ్వరరావు, మాదాల రవి, జస్టిస్ చంద్రకుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. షార్ట్ ఫిలింస్ విజేతలకు, ఉత్తమ నటీనటులకు, టెక్నీషియన్స్‌కి ఈ వేదికపై అవార్డులను ప్రదానం చేశారు.
ద్వితీయ ఉత్తమ లఘు చిత్రం: సోయి
రచన, దర్శకత్వం: శివకళ్యాణ్
బ్యానర్: పాలమూరి టాకీస్
తృతీయ ఉత్తమ లఘు చిత్రం: ఎంతెంత దూరం
రచన, దర్శకత్వం: వేణు నక్షత్రం
బ్యానర్: నక్షత్రం ప్రొడక్షన్స్
ఉత్తమ లఘు చిత్ర రచయిత: హిమజ్వాల
ఉత్తమ నటుడు: భూపాల్(ఎంతెంత దూరం)
ఉత్తమ నటి: సంకీర్తన(బీప్)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు: వేణు నక్షత్రం(అవతలివైపు)
ఉత్తమ బాలనటి(జ్యూరీ బహుమతి): సావిత్రి