రచయిత వక్కంతం వంశీ అంటే ఎన్టీఆర్‌కు చాలా గురి. ఆ నమ్మకంతోనే వంశీ కథను పూరీ చేత ఒప్పించి ‘టెంపర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వంశీకి తారక్ వద్ద మరింత గౌరవం ఏర్పడింది. కాగా ఇటీవల మరో స్టోరీలైన్‌ను తయారు చేసిన వంశీ తారక్‌కు వినిపించాడట. ఆ స్టోరీలైన్ ఎన్టీఆర్‌కు తెగ నచ్చడంతో వెంటనే స్టోరీని డెవలప్ చేయమని కోరాడట. అన్నట్లు వక్కంతం వంశీకి ఎప్పటికైనా దర్శకత్వం చేయాలనే కోరిక ఉంది. ఆల్‌రెడీ ఎన్టీఆర్ ఆ విషయంలో వంశీకి మాట ఇచ్చేశాడు. తాజాగా వంశీ తయారుచేసిన స్టోరీలైన్‌ను వక్కంతం వంశీ డైరెక్షన్‌లోనే చేయాలనే ఉద్ధేశ్యంతో తారక్ ఉన్నట్లు తెలుస్తోంది.సో..వంశీ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.