Advertisementt

బండ్ల గణేష్ తరువాత పవన్ లిస్ట్ లో వుంది అలీనే..!

Mon 09th Mar 2015 06:59 AM
pawan kalyan,ali,bandla ganesh,producer,gabbar singh  బండ్ల గణేష్ తరువాత పవన్ లిస్ట్ లో వుంది అలీనే..!
బండ్ల గణేష్ తరువాత పవన్ లిస్ట్ లో వుంది అలీనే..!
Advertisement
Ads by CJ
స్టార్‌ హీరోలు తలుచుకుంటే చేతిలో పది రూపాయలు లేకపోయినా ఎవ్వరినైనా నిర్మాతగా మార్చేయగలరు. ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా బండ్లగణేష్‌ ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోల డేట్స్‌ సంపాదించగలిగితే పెట్టుబడి దానంతట అదే వస్తుందని, సినిమా పూర్తయిన తర్వాత వాటిని తిరిగి ఇచ్చేస్తామని, అంతేగానీ స్టార్‌ హీరోల చిత్రాలు తీయాలంటే కోట్లు చేతిలో ఉండాల్సిన పనిలేదని గణేష్‌ ఒప్పుకున్నాడు. బండ్ల గణేష్‌ను అలాగే పెద్ద నిర్మాతగా మార్చిన ఘనత పవన్‌కు దక్కుతుంది. వాస్తవానికి పవన్‌ను నమ్ముకున్న వారికి ఆయన ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా సహాయపడతాడు. నిన్న బండ్లగణేష్‌ను నిర్మాతను చేసిన పవన్‌కళ్యాన్‌ త్వరలో కమెడియన్‌ అలీని కూడా నిర్మాతగా చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. వాస్తవానికి పవన్‌కు అలీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. పవన్‌ తన కెరీర్‌ స్టార్టింగ్‌ నుండి అలీతో వ్యక్తిగతమైన రిలేషన్స్‌కు కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అలీకి నిర్మాతగా సినిమా చేసుకుంటే డేట్స్‌ ఇస్తానని మాట ఇచ్చాడట. ఆయన మంచి కథతో, దర్శకునితో వస్తే వెంటనే సినిమా ప్రారంభించడానికి తాను రెడీగా ఉన్నట్లు అలీకి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదే పనిమీద అలీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అతిత్వరలో అలీని నిర్మాతగా చూసే అవకాశం ఉంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ