మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎమ్‌పవర్‌మెంట్ ఫర్ ఉమెన్’ సంస్థ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ నియోగిన్’ అవార్డులను ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లే, ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్టార్ మెంబర్ నాగులపల్లి పద్మిని హాజరై అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్నవారిలో మోడల్, నటి: నీలోఫర్, సోషల్ వర్కర్, మోడల్: సాధనా సింగ్, వీణా గజ్జల, కొల్లి సాయిజ్ఞాపిక, నిఖిత అనుమోలు, ప్రత్యూష సపోర్ట్, శశాంక మంద, శృతి వేణుగోపాల్, నవీన ఘనాటి, లక్ష్మీకుమారి, కృతి బీరమ్, సరిత, కిరణ్ డెంబ్లే, దివ్య యలమంచిలి వున్నారు.