హీరోయిన్ స్వాతి రెడ్డికి ఎన్ని హిట్స్ వచ్చినా కూడా సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది తప్ప వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకునే రకం కాదు. కాగా తమిళంలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరుపొంది, తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ‘పంజా’ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ తాజా తమిళ మూవీ ప్రారంభం అయింది. ఈ చిత్రంలో తమిళస్టార్ ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆర్య సరసన హీరోయిన్‌గా స్వాతిరెడ్డిని తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని, అందుకే అడిగిన వెంటనే ఆమె ఒప్పుకొందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం కూడా హిట్ అయితే స్వాతికి పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు మరన్ని వెతుక్కుంటూ వస్తాయనడంలో అతిశయోక్తి లేదు.