చాలాకాలంగా టాలీవుడ్‌లో ఓ అపోహ ఉంది. టాప్ డైరెక్టర్లయిన రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల తీరు కాస్త భిన్నంగా ఉంటుందని, రాజమౌళితో పనిచేసిన హీరోలతో త్రివిక్రమ్ చేయడని, త్రివిక్రమ్‌తో చేసిన వారితో రాజమౌళి సినిమాలు చేయడని చాలామంది నమ్ముతుంటారు. రాజమౌళి ఇప్పటివరకు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేశాడు. అయితే వీరిలోని ఎవ్వరితో త్రివిక్రమ్ సినిమాలు చేయలేదు. అదేసమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కల్యాన్, మహేష్‌బాబు, అల్లుఅర్జున్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేశాడు. వీరెవ్వరూ కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించలేదు. అయితే ఇది కాకతాళీయంగా జరిగిందే కానీ కావాలని చేసింది కాదని మరికొందరి వాదన. కాగా త్వరలో పవన్‌కల్యాణ్ తానే నిర్మాతగా రామ్‌చరణ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ను ఒప్పించాడని సమాచారం. ఇదే జరిగితే అటు రాజమౌళి, ఇటు త్రివిక్రమ్‌లు ఇద్దరితో సినిమా చేసిన ఘనత రామ్‌చరణ్‌కు దక్కుతుంది. అప్పుడైనా ఇలాంటి అపోహలకు ఫుల్‌స్టాప్ పడుతుందని అనుకోవచ్చు.