అల్లుఅర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సమ్మర్‌లోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత అల్లుఅర్జున్ బోయపాటిశ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బేనర్‌లో అల్లుఅరవింద్ నిర్మిస్తున్నాడు. సంగీతాన్ని తమన్ అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం లాంఛనంగా ఈనెల 21న ఉగాది పర్వదినం రోజున ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్ చివరి వారంలో అంటే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలైన వెంటనే ప్రారంభించనున్నారు. ఇందులో అల్లుఅర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.