Advertisementt

తారక్‌కు మరోసారి నిరాశ!

Mon 09th Mar 2015 06:26 AM
jr ntr,temper,50 crores club,temper collections  తారక్‌కు మరోసారి నిరాశ!
తారక్‌కు మరోసారి నిరాశ!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌కు మంచి హిట్టు వచ్చి చాలాకాలం అయింది. దాంతో ఆయన ఎంతో ఆకలితో ఉన్నాడు. తన సాటి హీరోలందరూ 50కోట్ల క్లబ్బులో చేరుతుంటే తాను కూడా ఎప్పుడు ఆ క్లబ్బులో చేరుతానా?అని మధనపడేవాడు. ఎట్టకేలకు ఆయనకు పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్‌’ చిత్రం అలాంటి అవకాశాన్ని కల్పించింది. ఓపెనింగ్స్‌ అదిరిపోయే సరికి ఎలాగైన ‘టెంపర్‌’తో ఆయన 50కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని ట్రేడ్‌వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. కానీ సినిమా బాగున్నప్పటికీ మంచి ఓపెనింగ్స్‌ సాధించినప్పటికీ ఈ చిత్రం 10రోజుల తర్వాత డీలాపడిపోయింది. కలెక్షన్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇక ‘టెంపర్‌’ క్లోజింగ్‌ బిజినెస్‌ 50కోట్లకు చేరడం అసాధ్యమని ట్రేడ్‌వర్గాలు తేల్చేశాయి. దీంతో ఎన్టీఆర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మరి ఆయన కోరికను తీర్చే సినిమా ఎప్పుడొస్తుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ