Advertisementt

రెండు కోట్లు డిమాండ్‌ చేస్తోన్న నిత్యా!

Sun 08th Mar 2015 12:57 PM
nitya menon,queen,tyagarajan,queen remake,2 crores  రెండు కోట్లు డిమాండ్‌ చేస్తోన్న నిత్యా!
రెండు కోట్లు డిమాండ్‌ చేస్తోన్న నిత్యా!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన కంనారౌనత్‌ మూవీ ‘క్వీన్‌’ చిత్రం దక్షిణాది హక్కులను త్యాగరాజన్‌ స్వంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించేందుకు సిద్దపడి మూడు భాషల్లోనూ ఫాలోయింగ్‌ ఉన్న నయనతార, సమంత వంటి హీరోయిన్లను ఈ చిత్రం చేయమని ఆయన అడిగాడట. కానీ వారు నో చెప్పడంతో ఈ మూడు భాషల్లో గుర్తింపు ఉన్న నిత్యామీనన్‌ను ఈ పాత్ర చేయమని అడిగాడట. సినిమా చేయడానికి ఓకే చెప్పిన నిత్యామీనన్‌ తనకు రెమ్యూనరేషన్‌గా రెండు కోట్లు కావాలని డిమాండ్‌ చేయడంతో తెల్లబోవడం త్యాగరాజన్‌ వంతు అయింది. వేరే ఆప్షన్స్‌ లేకపోవడం, కేవలం నిత్యామీననే రేసులో ఉండటంతో ఆమె ఇంతలా డిమాండ్‌ చేసిందని అంటున్నారు. త్వరలో రెమ్యూనరేషన్‌ విషయం ఆలోచించి తన నిర్ణయాన్ని చెబుతానని నిత్యాకి చెప్పిన త్యాగరాజన్‌ ప్రస్తుతం ఆమె అడిగినంత ఇవ్వలేక, వేరే దారిలేక డైలమాలో ఉన్నాడని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ