జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. అయితే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి మాత్రం హీరో నానికి పెద్ద ఫ్యాన్. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు..? స్వయంగా జూనియర్ ఎన్టీఆరే ఈ విషయాన్ని తెలిపాడు. నాని నటించిన ‘పిల్ల జమీందార్’ చిత్రంలో నాని నటన ఆమెకు చాలా నచ్చిందని, ఆ చిత్రాన్ని తనతో కలిసి లక్ష్మీప్రణతి ఎన్నిసార్లు చూసిందో లెక్కించడం కూడా కష్టమే అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన భర్తనే గుడ్డిగా ఆరాధించకుండా మరో హీరోకు ఫ్యాన్ అయిన విషయాన్ని నిర్భయంగా బయటపెట్టిన ఎన్టీఆర్ దంపతులను అందరూ ప్రశంసిస్తున్నారు.