Advertisementt

అందరిచూపు మే 15పైనే....!

Sat 07th Mar 2015 08:24 AM
bahubali,prabhas,rajamouli,may 15th release  అందరిచూపు మే 15పైనే....!
అందరిచూపు మే 15పైనే....!
Advertisement
Ads by CJ

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌, దర్శకదిగ్గజం రాజమౌళి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూద్దామా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలకాలంలో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌, ఉత్కంఠ మరే చిత్రానికి రాలేదనే చెప్పాలి. కాగా ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ట్యూన్స్‌కోసం, రీరికార్డింగ్‌ కోసం కీరవాణి ఎన్నడూ లేనివిధంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాడట. ఇక ‘బాహుబలి’ పార్ట్‌ 2 మాత్రం ఈ ఏడాది చివరలో రానుందని తెలుస్తోంది. మరి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు... యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ టాలీవుడ్‌లో 100కోట్లు వసూలు చేసే మొదటి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్రం ట్రేడ్‌వర్గాల్లో కూడా ఎంతో ఉత్సుకతను కలిగిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ