వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని లెక్కపెట్టట్లేదా..? ఆ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారా..? అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్‌రెడ్డి జైలు కెళ్లడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ఫిక్స్ అయ్యారా..?.. వైసీసీ ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే ఇలాంటి అనుమానాలు తలెత్తకమానవు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో సగం మంది అంటే కనీసం 30 మంది కూడా హాజరుకాకపోవడం అధినేతను నివ్వెరపరిచింది. ఒకప్పుడు తాను పిలవకముందే ఇంటి ఎదుట క్యూ కట్టిన నాయకులు ఇప్పుడెలా వ్యవహరిస్తుండటం జగన్ తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం.