తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ మీడియా విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే కేసీఆర్‌కు టీ న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ దినపత్రిక ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రిక ఏడు ఎడిషన్లతో నం. 3 స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రచురితమవుతోంది. ఇక ప్రభుత్వ వాణిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా అవసరం దృష్ట్యా ఇప్పుడు కేసీఆర్ మరో పేపర్‌ను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'తెలంగాణ టుడే' పేరుతో ఓ ఆంగ్ల దినపత్రికను కేసీఆర్ ప్రారంభించనున్నారు. రంగుల పేజీలతో, కొన్ని ఎడిషన్లతో తెలంగాణ టుడే పత్రికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సాక్షి, ఈనాడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచురిస్తున్నట్లు వాదనలు వినబడుతున్నాయి. ఈ తరుణంలో మరో దినపత్రికను కూడా కేసీఆర్ ప్రారంభిస్తే ఆయన మీడియాపై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది.