వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజుల్లోనే ఖాళీ అయిపోతుందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అంచనా వేస్తున్నారు. జేసీ వైసీపీలో చేరుతారన్న వార్తలపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తనకు ఆ అవసరం లేదని, కొన్ని రోజుల్లో ఆ పార్టీయే ఖాళీ అయిపోతుందని చెప్పారు. ఆ పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడు బయటపడుదామని అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇక హుదూద్ తుఫాను బాధితుల సాయార్థం ఎంపీ నిధుల నుంచి రూ. కోటి కేటాయించాలని చంద్రబాబు సూచిస్తే కుదరదని చెప్పినట్లు స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, అందుకోసం తాను నిధులు కేటాయించనని జేసీ చెప్పారు. మరి పార్టీ అధినాయకుడి మాట వినపోవడమే కాకుండా అడగకముందే ఆ విషయాన్ని మీడియాకు కూడా ఎందుకు చెప్పారన్నది ఇప్పుడు అర్థంకాకుండా ఉంది. మరి జేసీ మెల్లిమెల్లిగా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.