మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 గల్లంతై ఆదివారంతో ఏడాది గడుస్తుంది. 2014 మార్చి 08న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన ఈ విమానం హిందూ మహాసముద్రంలో ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. ప్రపంచంలోని ప్రతి మారుమూల ప్రాంతంలో విమానం ఆచూకీ కనిపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రస్తుతం నాలుగు భారీ నౌకల సాయంతో విమానం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విమానం గల్లంతై 239 మంది ఆచూకీ తెలియకపోవడంతో అసలు ఏంజరిగిందోనని తెలుసుకోవాలని వారు బంధువులు ఎదురుచూస్తున్నారు. అయితే 2009లో అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ఫ్రాన్స్ విమానం ఆచూకీ రెండేండ్ల తర్వాత దొరికింది. అదే ఆశతో ఎంహెచ్ 370 కోసం వెతుకుతున్నామని, గాలింపు చర్యలకు నేతృత్వం వహిస్తున్న మార్టిన్ డోలన్ తెలిపారు.