Advertisementt

నేషనల్ అవార్డు విజేత ఎడిటర్ కిషోర్ ఇక లేరు..!

Fri 06th Mar 2015 02:16 PM
ulava charu biriyani,national award winner,editor kishore,adukalam  నేషనల్ అవార్డు విజేత ఎడిటర్ కిషోర్ ఇక లేరు..!
నేషనల్ అవార్డు విజేత ఎడిటర్ కిషోర్ ఇక లేరు..!
Advertisement
Ads by CJ

మూవీ మొగల్ రామానాయుడు, ఎమ్మెస్ నారాయణ వంటి వారిని మరువక ముందే సినీ ప్రపంచంలో మరో వ్యక్తి కన్ను మూశారు. తెలుగులో 'ధోని' , 'గగనం' , 'ఉలవచారు బిరియాని' వంటి సినిమాలకు ఎడిటింగ్ చేసిన టాలెంటెడ్ టెక్నీషియన్ కిషోర్ గారు ఈరోజు మధ్యాహ్న వేళ చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. ఫాటల్ బ్రెయిన్ స్ట్రోక్ తో హాస్పిటల్ లో జాయిన్ అయిన కిషోర్ గారికి బ్రెయిన్ హ్యామరేజ్ ఉందని తేల్చిన వైద్యులు ఆ వ్యాధికి సంబంధిన ట్రీట్ మెంట్ కొనసాగించారు. సర్జరీ చేసినప్పటి నుండి కోమా లోనే ఉన్న వీరు ఈరోజు మరణించారని వైద్యులు దృవీకరించారు. తమిళంలో ధనుష్ నటించిన 'అడుకాలం' అనే సినిమాకు బెస్ట్ ఎడిటర్ గా కిషోర్ గారు నేషనల్ అవార్డు పొందారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ