Advertisementt

సమ్మర్‌ సీజన్‌కు బోణీ కొట్టనున్న గోపీచంద్‌..!

Fri 06th Mar 2015 01:56 PM
gopi chand,rasi khanaa,radha krishna,jil movie,vamsi,pramodh  సమ్మర్‌ సీజన్‌కు బోణీ కొట్టనున్న గోపీచంద్‌..!
సమ్మర్‌ సీజన్‌కు బోణీ కొట్టనున్న గోపీచంద్‌..!
Advertisement
Ads by CJ

‘లౌక్యం’ హిట్‌తో మంచి ఊపుమీదున్న గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘మిర్చి, రన్‌రాజారన్‌’ చిత్రాల తర్వాత యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘జిల్‌’. ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియోను ఈనెల 12న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర నిర్మాతలకు మంచి మిత్రుడైన హీరో ప్రభాస్‌ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రానున్నాడని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. వేసవి సీజన్‌కు బోణీ కొట్టేందుకు గోపీచంద్‌ సిద్దం అవుతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ అయితే వరుసగా తొలి మూడు సినిమాలను హిట్స్‌గా తమ ఖాతాలో వేసుకొన్న ఖ్యాతి నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లకు దక్కుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ