ఈమధ్యకాలంలో ప్రతిసారి ఆయన మద్రాస్ టాకీస్ బేనర్‌లో సినిమాలు తీయడం, అవి డిజాస్టర్ కావడం, బయ్యర్ల నిరసనలు, నిరాహారదీక్షలు కామన్ అయిపోయాయి. అందుకే క్రియేటివ్ జీనియస్ ఈసారి మనకెందుకులే ఈ తలనొప్పి అనుకున్నాడేమో గానీ, తన తాజా చిత్రం ‘ఓకే కన్మణి’ చిత్రాన్ని తమిళనాట సింగిల్ బయ్యర్‌కు ఇచ్చేశాడు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను తమిళనాడు మొత్తం విడుదల చేసేందుకు హక్కులు పొందింది. కాగా సామాన్యంగా మణిరత్నం చిత్రాలకు ఎక్కువగా తెలుగులో సాహిత్యాన్ని వేటూరి అందించేవారు. కానీ ఈమధ్యకాలంలో మణిరత్నం తన తెలుగు చిత్రాల విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సారి మాత్రం ‘ఓకే బంగారం’ చిత్రం హక్కులను దిల్‌రాజుకు అప్పగించి పాటల సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి చేత దగ్గరుండి రాయిస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం ద్వారా మణిరత్నం మరోసారి తన ఫామ్‌ను చేజిక్కించుకోవడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.