తన డ్రీమ్‌ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ని గుణశేఖర్ తన స్థాయికి మించి ఖర్చుపెట్టితీస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం బడ్జెట్ 60కోట్లను మించింది అంటున్నారు. ఒకానొక సమయంలో ఆర్దిక ఇబ్బందుల వల్ల సినిమా షూటింగ్‌ను ఆపేసే పరిస్థితి ఏర్పడిరదని తెలుస్తోంది. అయితే ‘గోనగన్నారెడి’ పాత్రను అల్లుఅర్జున్ చేయడం వల్ల ఈ చిత్రానికి ఎంతో మేలు జరిగిందని అంటున్నారు. ఆ పాత్రను చేయడానికి ఏ స్టార్‌హీరో ముందుకురాకపోవడంతో సినిమా విడుదలైనప్పుడు క్రౌడ్‌పుల్లర్ పాత్రను ఎవ్వరూ చేయమని చెప్పారు. పాపం.. గుణశేఖర్ దాదాపు అందరు స్టార్‌హీరోలను ఈ పాత్ర కోసం ఒప్పించాలని చూసినా ఎవ్వరూ ఆదుకోలేదు. చివరకు బన్నీ అందుకు ముందుకు వచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని ఆదుకున్నవారిలో పి.వి.పి. ముందున్నాడు. ఆయన సినిమా ఆగిపోయే సమయంలో ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచాడని తెలుస్తోంది. ఇక దిల్‌రాజు అయితే స్వయంగా నైజాం రైట్స్‌ను తన దగ్గరే ఉంచుకొని ఆర్థికంగా ఈ చిత్రాన్ని ఆదుకోవడమే కాదు.. సినిమాకు ట్రేడ్‌లో క్రేజ్‌ను తెచ్చిపెట్టాడు. ఇప్పటికే దిల్‌రాజు రషెష్ చూసి చాలా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.