Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరోయిన్‌ త్రిధా

Fri 06th Mar 2015 07:02 AM
heroine tridha chowdary,surya vs surya,nikhil,malkapuram sivakumar,karthik ghattamaneni,  సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరోయిన్‌ త్రిధా
సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరోయిన్‌ త్రిధా
Advertisement
Ads by CJ

నిఖిల్‌ హీరోగా సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన డిఫరెంట్‌ చిత్రం ‘సూర్య వర్సెస్‌ సూర్య’. ఈ చిత్రంలో నిఖిల్‌ సరసన త్రిధా హీరోయిన్‌గా నటించింది. గురువారం విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ త్రిధాతో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఎలా వచ్చింది?

నేషనల్‌ లెవల్‌లో క్లీన్‌ అండ్‌ క్లియర్‌, ఫ్రెష్‌ ఫేస్‌ హంట్‌ ద్వారా నేను బాగా ఫేమస్‌ అయ్యాను. ఎనిమిది సిటీస్‌లోని అమ్మాయిలు ఈ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు. ఫైనల్స్‌ ముంబాయిలో జరిగాయి. దాని తర్వాత నేను చాలా కమర్షియల్స్‌ చేశాను. డైరెక్టర్‌ కార్తీక్‌ నేను చేసిన టి.వి. సిరీస్‌ని యూ ట్యూబ్‌లో నా యాక్టింగ్‌ స్కిల్స్‌ చూసి సెలెక్ట్‌ చేసుకున్నారు. సంజన క్యారెక్టర్‌ కోసం ఎలాంటి ఆడిషన్‌ చేయలేదు. ఈ సినిమాలో నేను టి.వి. యాంకర్‌ రోల్‌ చేశాను. ఈ రోల్‌ చెయ్యాలంటే చాలా కాన్ఫిడెన్స్‌ వుండాలి. ఆ కాన్ఫిడెన్స్‌ నాకు కార్తీక్‌ ఇచ్చారు.

సంజన క్యారెక్టర్‌ చేయడం ఎలా అనిపించింది?

నా క్యారెక్టర్‌ గురించి చెప్పినపుడే నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. టాలీవుడ్‌లో నేను చేసిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ చేశాను. సంజన క్యారెక్టర్‌ చేయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. రొమాంటిక్‌ కామెడీగా అందరూ ఈ సినిమాని జస్టిఫై చేస్తున్నారు. నా క్యారెక్టర్‌ విషయానికి వస్తే చాలా వేరియేషన్స్‌ వున్నాయి. లవ్‌, ఎమోషన్స్‌, కోపంతోపాటు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌గా వుండే అమ్మాయి. ఈ సినిమాలో సంజన క్యారెక్టర్‌ని అందరూ ప్రేమిస్తారు. ఒక జెనెటిక్‌ డిజార్డర్‌తో పగలు బయటికి రాలేని అబ్బాయి, నైట్స్‌ తిరగడానికి ఇష్టపడని అమ్మాయి..వీళ్ళిద్దరి లవ్‌స్టోరీ అంటే ఎలా వుంటుంది? వాళ్ళిద్దరూ ఎలా లవ్‌ చేసుకున్నారు? వాళ్ళ లవ్‌ ఎలా సక్సెస్‌ అయింది అనేది చాలా బాగా చెప్పారు మా డైరెక్టర్‌ కార్తీక్‌. వీళ్ళిద్దరి లవ్‌ సక్సెస్‌ చేయడంలో తనికెళ్ళ భరణిగారు చేసిన ఎర్సమ్‌ క్యారెక్టర్‌, సత్య చేసిన అరుణసాయి క్యారెక్టర్‌, హర్ష చేసిన గోలా ఐస్‌ అమ్మే కుర్రాడి క్యారెక్టర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ కథ విన్నప్పుడే నేను చాలా ఎక్సైట్‌ అయ్యాను. తప్పకుండా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే సినిమా సూపర్‌హిట్‌ అయింది. నేను చేసిన క్యారెక్టర్‌కి చాలా అప్రిషియేషన్స్‌ వస్తున్నాయి. 

ఇంతకుముందు బెంగాలీ మూవీస్‌ చేశారా?

నేను బేసిక్‌గా బెంగాలీ. బెంగాలీలో కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో కూడా ఇంట్రడ్యూస్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. సౌత్‌లో ఎంతో మంచి టెక్నీషియన్స్‌ వున్నారు. 

హీరో నిఖిల్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

ఐ యామ్‌ సో హ్యాపీ. నిఖిల్‌ ఎంతో ఎనర్జిటిక్‌గా వుంటాడు. నేను అతనితో సమానంగా ఎనర్జీ చూపించే ప్రయత్నం చేశాను. ఈ క్యారెక్టర్‌ చెయ్యడంలో నిఖిల్‌ ఎంతో హెల్ప్‌ చేశాడు. ఏ సీన్‌ చేసిన తక్కువ టేక్స్‌లో కంప్లీట్‌ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి సీన్‌ నాకు ఎక్స్‌ప్లెయిన్‌ చేసేవాడు, ఎలా పెర్‌ఫార్మ్‌ చెయ్యాలో చెప్పేవాడు. డైరెక్టర్‌ బాధ్యతల్ని ఎన్నో తన భుజాలపై వేసుకొని హెల్ప్‌ చేసేవాడు. 

డైరెక్టర్‌గా కార్తీక్‌కి ఇది మొదటి సినిమా. అతని వర్కింగ్‌ స్టైల్‌ ఎలా వుంది?

చాలా ఎక్స్‌లెంట్‌ డైరెక్టర్‌. తన ఫస్ట్‌ మూవీకే ఒక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఇది ఒక మంచి ఎక్స్‌పెరిమెంటల్‌ మూవీ. ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా తనకంటూ ఒక మార్క్‌ ఏర్పరచుకున్నారు కార్తీక్‌. అతను అంతకుముందు సినిమాటోగ్రఫీ అందించిన ‘కార్తికేయ’ చిత్రాన్ని చూశాను. చాలా డిఫరెంట్‌గా వుంది. అలాగే ఈ సినిమా 80 శాతం నైట్‌ ఎఫెక్ట్‌లో తీశారు. లైటింగ్‌ తక్కువ వున్నా క్వాలిటీతో మంచి ఔట్‌ పుట్‌ ఇచ్చారు.

టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఎలా వుంది?

సో నైస్‌. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ‘కార్తికేయ’ చూశాను. తర్వాత ‘టెంపర్‌’ చూశాను. ఎన్టీఆర్‌ డాన్స్‌ చాలా బాగా చేస్తారు. ఈమధ్య టి.వి. ఛానల్స్‌లో ప్రోగ్రామ్స్‌ చేసినపుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఎంతో ఫ్రెండ్లీగా మూవ్‌ అయ్యారు. ఆ ప్రోగ్రామ్స్‌లో తెలిసింది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ని, మహేష్‌ని ఎంతగా ప్రేక్షకులు అభిమానిస్తారో. 

ఈ సినిమా ఎక్కువ శాతం నైట్స్‌లోనే షూటింగ్‌ జరిగింది. మీరెలా ఫీల్‌ అయ్యారు?

మొదటి రెండు మూడు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. అయితే తర్వాత అలవాటైంది. నేను నేచురల్‌గానే నైట్స్‌ ఎక్కువగా ఇష్టపడను. అలాంటిది ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్‌ షూట్‌లే చెయ్యాల్సి వచ్చింది. నైట్‌ షూట్‌ అయినప్పటికీ అనుకున్న టైమ్‌లోనే ఎలాంటి హడావిడి లేకుండా చాలా కూల్‌గా షూట్‌ చేశాం. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

తెలుగులో నా సెకండ్‌ మూవీ ఇంకా కన్‌ఫర్మ్‌ చెయ్యలేదు. ప్రస్తుతం ఒక బెంగాల్‌ మూవీ చేస్తున్నాను. బెంగాల్‌లో ప్రముఖ దర్శకుడు కమలేశ్వర్‌ ముఖర్జీ చిత్రంలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించింది ‘సూర్య వర్సెస్‌ సూర్య’ హీరోయిన్‌ త్రిధా. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ