Advertisementt

క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నం...!

Thu 05th Mar 2015 11:24 PM
maruthi,bus stop,erojullo,kottha janta,bale bale magadivoy  క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నం...!
క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నం...!
Advertisement
Ads by CJ

మారుతి.. టాలీవుడ్‌లో టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌.. చాలా మంది ఆయన్ను చిన్న చిత్రాల రాజమౌళి అని కూడా పిలుస్తుంటారు. ‘ఈరోజుల్లో , బస్టాప్‌’ వంటి చిత్రాలతో విజయం కేతనం ఎగురవేసిన మారుతిపై బూతు చిత్రాల దర్శకుడు అనే ముద్ర పడిపోయింది. దాన్ని తొలగించుకొని క్లీన్‌ ఎంటర్‌టైనర్స్‌ను తీసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇప్పటికే ‘ప్రేమకథాచిత్రమ్‌, కొత్తజంట’ చిత్రాలను తీశాడు. అయినా ఆయనపై బూతు ముద్ర పోలేదు. దీంతో స్టార్‌ హీరోల నుండి యంగ్‌ హీరోల వరకు ఆయనపై చిన్నచూపు చూస్తున్నారు. వెంకటేష్‌తో చేయాల్సిన ‘రాధ’, సునీల్‌, నితిన్‌ల సినిమాలు అందుకే  పట్టాలెక్కలేదు. అయినా మారుతి తన పట్టువిడువలేదు. తాజాగా గీతాఆర్ట్స్‌, యు.వి. క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘భలే భలే మగాడివోయ్‌’ అనే చిత్రాన్ని నానితో తీస్తున్నాడు. ఈ చిత్రం తనకు క్లీన్‌ చిత్రాల దర్శకునిగా మంచి పేరును తెస్తుందనే ఆశతో మారుతి ఉన్నాడు. మరి ఆయన ఈ ప్రయత్నంలో సక్సెస్‌ అవుతాడో లేదో చూడాలంటే ఆగష్టు వరకు వెయిట్‌ చేయాల్సిందే...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ