రీసెంట్‌గా ‘టెంపర్’ ఇచ్చిన కిక్‌లో ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్‌లో భారీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘టెంపర్’ చిత్రంలో ‘దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయిన నేపథ్యంలో తమ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పెడితే కరెక్ట్‌గా యాప్ట్ అవుతుందని యూనిట్ భావిస్తోందిట. కాగా ఈ చిత్రం తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. ఎన్టీఆర్‌కు తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్, గెటప్, క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది...!