నిర్మాతగా ఇండస్ట్రీలో తనకు లైఫ్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ హీరోలు అని చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ అవకాశం దొరికినప్పుడల్లా వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తూంటాడు. తాజాగా ఆయన మరోసారి మెగాఫ్యామిలీ గురించి మాట్లాడాడు. నిర్మాతగా తనకు జీవితాన్ని ఇచ్చింది పవన్‌కళ్యాణ్ అని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని ఆయనన చెప్పుకొచ్చాడు. అలాగే పరిశ్రమలో నిలబడేందుకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగానో ఉంది అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారు పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చారు. ఆయనకు హార్డ్‌వర్క్ అంటే ఏమిటో తెలుసు. కానీ రామ్‌చరణ్ వెల్‌సెటిల్డ్ సినిమా స్టార్ల ఫ్యామిలీలో పుట్టాడు. అయినప్పటికీ ఏ మాత్రం గర్వం ఉండదు. ఆయన ఇతరుల పట్ల ఎంతో మర్యాదగా ఉంటారు. అందుకే చిరంజీవి కంటే రామ్‌చరణ్ గ్రేట్ అని నేను అంటాను.. అని చెప్పుకొచ్చాడు.