తెలుగు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ వచ్చిన బండ్లగణేష్ ఒక్కసారిగా బడా నిర్మాతగా మారి భారీ సినిమాలు తీస్తుండటంతో చాలామందిలో అనుమానాలు మొలకెత్తాయి.ఆయన కొందరు స్టార్‌హీరోలు, రాజకీయనాయకులకు బినామీ అని, వారు పెట్టుబడి పెట్టి ఈయనతో సినిమాలు తీయిస్తున్నారనేది ఇండస్ట్రీటాక్.ఆ మద్య గణేష్ బొత్స సత్యనారాయణకు బినామీ అనే వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయం గురించి గణేష్ మాట్లాడుతూ... తాను ఎవ్వరికీ బినామీ కాదని, ఆ ప్రచారం అంతా ట్రాష్ అని కొట్టిపారేశాడు. నేను బినామీ అయితే తన పరమేశ్వర ఆర్ట్స్ సంస్థ 50లక్షల అప్పుల్లో ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించాడు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హీరోల డేట్స్ సంపాదిస్తే చాలు.. చాలామంది ఫైనాన్స్ చేస్తారు. సినిమా పూర్తయిన తర్వాత ఆ డబ్బు తిరిగి కట్టేయవచ్చు. నేను చేసే పని అదే... అని స్పష్టం చేశాడు బండ్ల గణేష్..!