రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా.. కేంద్రం కేటాయింపులపై సర్దుకుపోవడమే మేలని చంద్రబాబు క్యాబినెట్ కమిట్ అయినట్లు కనిపిస్తోంది. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా కేంద్రాన్ని నిలదీసి అడగకుండా క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి బదులు చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని నరేంద్రమోడీలను కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ఏపీకి నిధుల కేటాయింపు గురించి ఏడుసార్లు అటు ప్రధానిని ఇటు కేంద్ర ఆర్థిక మంత్రిని కలుసుకున్నారు. అయినా రాష్ట్రానికి బీజేపీ సర్కారు ఎంతటి న్యాయం చేసిందో గమనించవచ్చు. ఇక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఢిల్లీలో పర్యటించి చంద్రబాబు ఏంసాధిస్తారో తెలియకుండా ఉంది. ఇక ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఇక ఆయన ఢిల్లీకి తిరిగిరాగానే తాను వెళ్లి కలవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.