Advertisementt

కలయా...? నిజమా...? ఈ కాంబినేషన్స్..!

Thu 05th Mar 2015 07:03 AM
pawan kalyan,dasari narayana rao,ram charan,sreekanth  కలయా...? నిజమా...? ఈ కాంబినేషన్స్..!
కలయా...? నిజమా...? ఈ కాంబినేషన్స్..!
Advertisement
Ads by CJ

రైలు పట్టాలు సుదీర్ఘంగా చూస్తే ఎక్కడో కలిసి పోయినట్లు అనిపిస్తాయి. ఆకాశం భూమి కలిసి పోయినట్లు కనిపిస్తాయి. ఉప్పు నిప్పు కలిసిపోయాయేమో అనిపిస్తుంది. అలాంటి రేర్‌ కాంబినేషన్స్‌ ఇప్పుడు సెట్‌ అవుతూ.. అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. రాజకీయాల్లో లాగానే సినిమా ఫీల్డ్‌లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని నిజం చేస్తున్నాయి, అసలు పవన్‌కళ్యాణ్‌ హీరోగా దాసరి నిర్మాణంలో ఓ చిత్రం రానున్నట్లు వార్తలు వస్తే దానిని ఎవ్వరూ నమ్మరు. కానీ అది అక్షరాల నిజం అయింది. ఇక ఇటీవల మెగాఫ్యామిలీలో ఏర్పడ్డ స్పర్థల కారణంగా రామ్‌చరణ్‌ హీరోగా పవన్‌కళ్యాన్‌ ఓ సినిమాను నిర్మిస్తున్నాడనే వార్త కూడా అలాంటిదే. ఇక బాలకృష్ణ శ్రీవాస్‌తో పనిచేయనుండటం, దానికి కోనవెంకట్‌, గోపీమోహన్‌లు రచయితలుగా పనిచేస్తుండటం కూడా అలాంటి రేర్‌ కాంబినేషన్‌ కిందనే చెప్పాలి. మరి వీటన్నింటిని కలలో కాకుండా, వాస్తవంలోకి వచ్చి నిజం అని ఒప్పుకొన్నా ఇంకా ఈ చిత్రాలు చాలామందికి కలలాగానే కనిపిస్తుండటం విశేషం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ