సౌత్ హీరోలలో రజనీకాంత్‌కు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన స్టైల్, డ్యాన్స్‌లకు జపనీస్ ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే రజనీ తర్వాత జపాన్‌లో అంతటి క్రేజ్‌ను సాధించిన సౌత్ ఇండియన్ హీరో ఎన్టీఆర్ మాత్రమే. రజనీలాగానే ఎన్టీఆర్‌కు కూడా అక్కడ రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ కూడా రజనీ కోవలోనే తన స్టైల్, డ్యాన్స్‌లతో జపనీయుల మనస్సులో స్థానం సంపాదిస్తున్నాడు. ఎన్టీఆర్‌పై ఏకంగా ఫిజు అనే జపాన్ చానెల్ డాక్యుమెంటరీని తయారు చేసిందంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ‘బాద్‌షా’తో మొదలై ‘రభస’తో కూడా అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. దీంతో ఆయన నటించిన మిగతా చిత్రాలను కూడా జపనీస్ వెర్షన్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దపడుతున్నారు. కాగా తాజాగా ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఓవర్‌సీస్, రెస్టాఫ్ ఇండియాలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కాగా ఇదే చిత్రాన్ని జపాన్‌లో జపనీస్ వెర్షన్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ చిత్రం అక్కడ కూడా కలెక్షన్ల మోత మోగిస్తోందిట. మొత్తానికి మన టాలీవుడ్ హీరోలకు తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో సరైన క్రేజ్ లేదు.. అనే అపవాదును ఎన్టీఆర్ చెరిపేస్తున్నాడు.