Advertisementt

గుణశేఖర్‌కు కాస్త ఊరట...!

Wed 04th Mar 2015 07:25 AM
gunasekhar,rudhramadevi,anushka,rana,ilayaraja  గుణశేఖర్‌కు కాస్త ఊరట...!
గుణశేఖర్‌కు కాస్త ఊరట...!
Advertisement
Ads by CJ

తన సర్వస్వాన్ని ఫణంగా పెట్టి దర్శకనిర్మాత గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. అనుష్క, రానా, నిత్యామీనన్‌లతో పాటు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటంతో ఈ చిత్రానికి తమిళంలో మంచి క్రేజ్‌ ఏర్పడిందని, ఈ చిత్రం తమిళ వెర్షన్‌ హక్కులను 10కోట్లకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దాదాపు 50కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గుణశేఖర్‌కు ఎంతో కొంత ఊరట లభించినట్లే అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. అయినా కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే తెలిసిన ‘రుద్రమదేవి’ చరిత్ర ఇతర భాషల వారిని ఎలా ఆకట్టుకుంటుందో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ