Advertisementt

జాక్‌పాట్‌ కొట్టిన ప్రభుదేవా...!

Wed 04th Mar 2015 06:43 AM
kamalhasan,gowthami,prabhudeva,vasavi visual venchers  జాక్‌పాట్‌ కొట్టిన ప్రభుదేవా...!
జాక్‌పాట్‌ కొట్టిన ప్రభుదేవా...!
Advertisement
Ads by CJ

లోకనాయకుడు కమల్‌హాసన్‌ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఉత్తమవిలన్‌’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క ఆయన తన స్వీయ దర్శకత్వంలో ‘విశ్వరూపం2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరోపక్క మలయాళ ‘దృశ్యం’కి రీమేక్‌గా రూపొందుతున్న ‘పాపనాశనం’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో కమల్‌హాసన్‌కి జోడీగా చాలాకాలం తర్వాత గౌతమి నటిస్తోంది. ఈ మూడు చిత్రాలు ఇదే ఏడాది విడుదలకు సిద్దమవుతున్నాయి. కాగా త్వరలో కమల్‌హాసన్‌ ప్రభుదేవా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని, ఈ చిత్రాన్ని వాసన్‌ విజువల్‌ వెంచర్స్‌ సంస్థ నిర్మించనుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కించేందుకు రంగం సిద్దమవుతోంది. ఇదేకాక ఆయన త్వరలో ఓ స్ట్రెయిట్‌ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడని సమాచారం. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు నిర్మిస్తారు? అనే విషయాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ