Advertisementt

కమల్ సరసన అనుష్క నటించనుందా..!

Wed 04th Mar 2015 04:29 AM
anushka,kamalhasan,thriller cum action movie,kollywood  కమల్ సరసన అనుష్క నటించనుందా..!
కమల్ సరసన అనుష్క నటించనుందా..!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న స్టార్ హీరోయిన్ అనుష్క. తెలుగులో అనుష్క నటించిన 'రుద్రమదేవి' , 'బాహుబలి' విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగుతో పాటు, కోలీవుడ్ స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్, సూర్య, అజిత్ లాంటి వారి సరసన అవకాశాలు దక్కించుకొని తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది అనుష్క. అయితే కోలీవుడ్ లో స్టార్ హీరో అయిన కమల్ హాసన్ సరసన నటించే ఛాన్స్ అనుష్క కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కమల్ 'ఉత్తమ విలన్' , 'విశ్వ రూపం2' , 'పాపనాసనం' సినిమాల నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తరువాత కమల్ హాసన్ స్వయంగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు. థిల్లర్ కమ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించే ఈ సినిమాలో అనుష్క నటించనుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ