Advertisementt

'మోసగాళ్ళకు మోసగాడు' రెడీ అవుతున్నాడు!

Wed 04th Mar 2015 04:12 AM
sudheer babu,mosagallaku mosagadu,chakri chigurupati  'మోసగాళ్ళకు మోసగాడు'  రెడీ అవుతున్నాడు!
'మోసగాళ్ళకు మోసగాడు' రెడీ అవుతున్నాడు!
Advertisement
Ads by CJ

లక్ష్మి నరసింహ  ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్ 'స్వామిరారా' చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు నిర్మాత చక్రి చిగురుపాటి. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా 'స్వామిరారా2' నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. కాని ఈ చిత్రానికి టైటిల్ గా 'మోసగాళ్ళకు మోసగాడు' ను ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో ఇదే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కృష్ణ కుటుంబసభ్యుడైన సుదీర్ బాబు హీరోగా నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకొని రికార్డింగ్ పనులలో బిజీగా ఉందని సమాచారం. దర్శకుడు ఎ.ఎన్.బోస్, ఈ చిత్రం తో స్వామి రారా కంటే పెద్ద సక్సెస్ ని ఈ బ్యానర్ కి అందివ్వబోతున్నాడని అప్పుడే టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర ఆడియో జరగనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ