Advertisementt

అఖిల్ ముందు పెద్ద సవాల్..!

Wed 04th Mar 2015 02:58 AM
akhil,vinayak,mahesh manjrekar,gopichand,ntr  అఖిల్ ముందు పెద్ద సవాల్..!
అఖిల్ ముందు పెద్ద సవాల్..!
Advertisement
Ads by CJ
బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు మహేష్‌మంజ్రేకర్‌ స్టేజీఆర్టిస్ట్‌ నుండి ఎదిగాడు. ఆయన నటించే చిత్రాల్లో ఆయన నటన ఇతరులను డామినేట్‌ చేసే స్థాయిలో ఉంటుంది. గోపీచంద్‌, ఎన్టీఆర్‌ వంటి వారికే ఆయన గతంలో చుక్కలు చూపించాడు. తాజాగా ‘అదుర్స్‌’తో చేసిన పరిచయంతో వినాయక్‌ అఖిల్‌ తొలి చిత్రంలో విలన్‌గా మహేష్‌మంజ్రేకర్‌ని తీసుకున్నట్లు సమాచారం. ఎంత చిన్నప్పుడు నటించినా, ‘మనం’లో గెస్ట్‌గా చేసినా, యాడ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్న అనుభవం వంటివి ఉన్నప్పటికీ అఖిల్‌కి పూర్తిస్థాయి హీరోగా ఇదే మొదటి సినిమా. ఇలా మొదటి చిత్రంలోనే మహేష్‌మంజ్రేకర్‌ వంటి ఆర్టిస్టుతో నటించాల్సిరావడం చాలా కష్టమైన పనే. మరి అఖిల్‌ మహేష్‌ నటన ముందు తేలిపోతాడేమో? అని చాలామంది కంగారుపడుతున్నారు. మరి ఆయనకు ధీటుగా అఖిల్‌ ఎలా సమాధానం ఇస్తాడు? అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ