ఇటీవల ఫామ్ కోల్పోయి వరుస పరాజయాలు చవిచూస్తున్న క్రియేటివ్ జీనియస్ ఆశలన్నీ తాజాగా ఆయన తెరకెక్కించిన ‘ఓకే కన్మణి’ (తెలుగులో ‘ఓకే బంగారం’)పైనే ఉన్నాయి. ఈ చిత్రం స్టిల్స్‌తోపాటు టీజర్ చూస్తుంటే ఈ చిత్రంతో మణి మరలా తన పూర్వ వైభవాన్ని సాధించడం ఖాయమంటున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 14న ఒకేసారి విడుదల చేసేందుకు మణిరత్నం సిద్దమవుతున్నాడు. అదే సమయంలో ఆయన రిలీజ్ డేట్‌ను ఎంచుకోవడంలో సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మణిరత్నం తీసిన ఆణిముత్యం ‘సఖి’ చిత్రం 15ఏళ్ల కిందట ఇదే తేదీన అంటే ఏప్రిల్ 14న విడుదలైందని, అదే సెంటిమెంట్‌ను మణి ఫాలో అవుతున్నాడని అంటున్నారు. కాగా ఈ చిత్రానికి ‘సఖి’ తర్వాత మరోసారి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ పనిచేస్తుండటం విశేషం.