తమిళంలో మాస్‌హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగబ్బాయి విశాల్. ఆయన తమిళంలో
నటించిన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతూ వస్తున్నాయి. అయితే చాలాకాలంగా ఆయన తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేస్తానని చెబుతూ వస్తున్నాడు. ఈ చిత్రానికి ముహూర్తం దగ్గరపడిరది. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రారంభం కానుందని, శశికాంత్ అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్‌హీరో నితిన్ తన స్వంత బేనర్ శ్రేష్ఠ్ మూవీస్, విశాల్ హోం బేనర్ విశాల్ ఫిల్మ్‌ఫ్యాక్టరీలతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. మరి ఈ చిత్రంతోనైనా ఇతను తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకొని తెలుగబ్బాయి అనిపించుకుంటాడో లేదో చూడాల్సివుంది...!